క్రీడాకారులు ఆటల్లో రాణించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. క్రీడా పోటీల్లో బహుమతులు సాధించిన క్రీడాకారులకు ఎమ్మెల్యే… విశాఖ ఏ కాలనీలోని తన కార్యాలయంలో అభినందించారు. సౌత్ వెస్ట్ ఇంటర్ యూనివర్సిటీలో బంగారు పతకం సాధించిన బోరవెల్లి గ్రామానికి చెందిన దోబ యామశ్రీని, స్కూల్ గేమ్స్ అండర్ 19 సిల్వర్ మెడల్ తాళాడు కావ్యను, స్కూల్ గేమ్స్ అండర్ 19 బ్రాంచ్ మెడల్ సాధించిన పట్నాన్ చంద్రశేఖర్ ను ఎమ్మెల్యే అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని ఇటీవల స్పోర్ట్స్ కోటాలో క్రీడాకారులకు ప్రాధాన్యత కల్పిస్తూ నిర్ణయించిందని వివరించారు.