నిన్నకాక మొన్న విద్యుత్ ట్రూప్ ఆప్ చార్జీల పెంపుపై విజయనగరం జిల్లా సీపీఎం పార్టీ కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో అదీ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో,ధర్నా,నిరసన చేయగా .తాజాగా మరో వామపక్ష పార్టీ అయిన సీపీఐ కూడా అదే జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సేమ టూ సేమ్ నిరసన వ్యక్తం చేసింది.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదానీ గ్రూప్ లతో కుమ్మక్కై, పెట్టుబడుల కోసం దేశ సంపదను తాకట్టుపెట్టిందంటూ సీపీఐ నేతలు బుగత అశోక్,ఒమ్మి రమణలు ధ్వజమెత్తారు.ఈ మేరకు సీపీఐ జెండాలతో నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అరగంట సేపు నిరసన వ్యక్తం చేసారు.