ర‌హ‌స్యంగా జిల్లా వైఎస్ఆర్పీపీ కార్యాల‌య భ‌వ‌న‌ నిర్మాణఃం…!విజ‌య‌న‌గ‌రం కూట‌మి ఎమ్మెల్యే ఆదితీ..సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

5

రాష్ల్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ…త‌మ‌,త‌మ జిల్లా పార్టీ కార్యాల‌యాల‌కు స్వంత భ‌వ‌నాల‌ను నిర్మించిన సంగ‌తి తెలిసిందే.అయితే ఆ నిర్మాణాలు అక్ర‌మంగా ఉన్నాయంటూ తాజాగా అధికార కూట‌మి బాహాటంగా…ఆరోపించ‌డ‌మే కాకుండా…సోష‌ల్ మీడియాల‌లో కూడా ఆ క‌ట్ట‌డాల‌ను ఫోటోలు పెట్టి..ట్రోల్ చేస్తోంది.ఈ త‌రుణంలోనే అస‌లు ఆ పార్టీ కార్యాల‌య క‌ట్ట‌డాల‌ను ఏవిదంగా క‌ట్టారో…ప్ర‌త్య‌క్షంగా పరిశీల‌న‌కు వెళ్లారు…విజ‌య‌నగ‌రం కూట‌మి ఎమ్మెల్యే..ఆదితి గ‌జ‌ప‌తి రాజు.ప్ర‌తీ చిన్న కార్య‌క్ర‌మాన్ని…కొబ్బ‌రికాయ కొట్టి హంగుహార్బాటాలు చేసే వైఎస్ఆర్పీపీ…ఈ పార్టీ కార్యాల‌య అతి పెద్ద భ‌వ‌నాన్ని గుట్టు చ‌ప్పుడు కాకుండా నిర్మించ‌డ‌మేంట‌నేది…అసలు ప్ర‌శ్న అని విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే ఆదితీ గ‌జ‌ప‌తిరాజు ప్ర‌శ్నించారు.ఈ ఆక‌స్మ‌క క్షేత్ర ప‌ర్య‌ట‌న‌లో..టీడీపీ నేత‌ల‌తో పాటు జ‌న‌సేన‌,బీజేపీ నేత‌లు కూడా ఉన్నారు.ఇక ఈ ప‌ర్య‌ట‌న‌లో విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యేతో పాటు టీడీపీ రాష్ట్ర నేత ఐవీపీ రాజు పార్టీ నగ‌ర అధ్య‌క్షుడు ప్ర‌సాదుల ల‌క్ష్మీ వ‌ర‌ప్ర‌సాద్,ఆల్తి బంగారు నాయుడు,న‌ర్సింగ‌రావు..త‌దిత‌రులు ఉన్నారు.