విజయనగరం జిల్లాలో కొత్తవలస వద్ద ఉన్న జిందాల్ ఫెర్రో ఎల్లాయిస్ ఫ్యాక్టరీ పుణ్యమా…దాదాపు350 మంది కార్మికులు రోడ్డున పడ్డారు.తక్షణమే ఆ కంపెనీ తెరిపించాలంటూ…కలెక్టరేట్ వద్ద జిందాల్ కార్మికులు ధర్నా నిర్వహించారు.మండు టెండలో మాడు పగిలే భానుడిని సైతం లెక్క చేయకుండా దాదాపు…100 మంది కార్మికులు..కలెక్టరేట్..అవుట్ గేట్ వద్ద..ధర్నాతో నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా కార్మిక నేత పిల్లా అప్పలనాయుడు మాట్లాడుతూ…జిందాల్ లో వందలాదికార్మికులు…ఫ్యాక్టరీ లాకౌట్ కారణంగా..పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఫ్యాక్టరీ లాకౌట్ పుణ్యమా…దాదాపు 400 మందికి కార్మికులు రోడ్డున పడ్డారని నేత అప్పల నాయుడు ఆరోపించారు. తక్షణమే కలెక్టర్..జోక్యం చేసుకుని…జిందాల్ ఫ్యాక్టరీని తెరిపించాలని కార్మికులుంతా గొంతెత్తి డిమాండ్ చేసారు.ఎలాంటి అలర్లు జరగకుండా ముందస్తు చర్యగా..వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు, ఎస్ఐ నవీన్ పడాల్..సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
Home Uncategorized కలెక్టరేట్ ఎదుట జిందాల్ కార్మికుల ఆందోళన…మండే ఎండను సైతం లెక్క చేయకుండా ధర్నా…!వన్ టౌన్ సీఐ...