ప్రజలకు మనకు ధమ్కీలు చేసేందుకు పదవి ఇవ్వలేదని విజయనగరం ఎమ్మెల్యే ఆదితీ గజపతిరాజు అన్నారు.విజయనగరం అశోక్ బంగ్లాలో జరిగిన విజయనగరం టీడీపీ విస్త్రత స్తాయీ సమావేశంలో ఆమ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా విజయనగరం ఎమ్మెల్యే ఆదితీ గజపతి రాజు…మాజీ ఎమ్మెల్యే.. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల స్వామిని నేరుగా లక్ష్యం చేసుకుని ఆమె మాట్లాడారు. వీరభద్రస్వామి లాగ మనము ధమ్కీ చేసేందుకు ప్రజలకు పదవి కట్టబెట్టలేదని ఎమ్మెల్యే ఆదితీ అన్నారు. ఈ అయిదేళ్లలో ఆయన పాలన కు విసిగి…వేసారెత్తే…టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఎమ్మెల్యే పదవి కట్డబెట్టారని ఎమ్మెల్యే అన్నారు.ఇవన్నీ అందరూ స్పష్లంంగా గమనించి సంక్షేమ పాలనకు చేయూత ఇవ్వాలన్నారు.అలాగే అభివాదాలు,శుభాకాంక్షలు చెప్పాలంటే…బొకేలు,పుష్ప గుచ్చాలు కాకుండా..బుక్స్,పెన్ లు…ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదితీ కోరారు.