ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా పని చేద్దాం అని విజయనగరం కూటమి ఎమ్మెల్యే ఆదితీ గజపతిరాజు అన్నారు.ఈ మేరకు పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో…
విజయనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు హాజరయ్యారు.ఈ సందర్బంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలు ఎన్డీయే ని గెలిపించి మనందరిపై పెద్ద బాధ్యతను పెట్టారన్నారు. మనపై నమ్మకంతో గెలిపించారని, మన రాష్ట్రాన్ని మరియు విజయనగరాన్ని రక్షించడానికి ఈ తీర్పు ఇచ్చారని అన్నారని, ఇంతటి విజయానికి నిరంతరం కృషి చేసిన పార్టీల శ్రేణులకు కృతఙ్ఞతలు తేలియజేశారు. మరియు ముందుగా పార్టీ శ్రేణులు అందరు ఆయా వార్డులు, గ్రామాల వారీగా ప్రజా సమస్యలను గుర్తించి పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ప్రజల పట్ల మన పార్టీ సభ్యులు అందరూ చాలా బాధ్యతగా ఉండాలని, ఈ భాద్యతను అజమాయిషీ చెలాయించడానికి ఇవ్వలేదని, కోలగట్ల వీరభద్ర స్వామి చేసినట్టు బలవంతం వసూళ్లు చేయడానికి ఇవ్వలేదని గుర్తించాలని విజ్ఞప్తి చేసారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటినుండి మనం ప్రజల పక్షాన ఉన్నామని, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేశామని, అదే స్పూర్తితో పనిచేయాలని అన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఫించన్లు పెంపు, అన్నా క్యాంటీన్ ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి ఫైల్స్ పై సంతకాలు పెట్టి ప్రజల కోసం పనిచేయడానికి ఎన్డీయే ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో ఉందొ తెలియజేసారని, అదేవిధంగా మనం కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా పని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎవరికైనా శుభాకాంక్షలు తెలిపినపుడు బుక్స్, పెన్స్ వంటివి ఇస్తే ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గ, పట్టణ/మండల స్థాయి, వార్డు/గ్రామ స్థాయి నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Home Uncategorized ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా పని చేద్దాంవిజయనగరం కూటమి ఎమ్మెల్యే ఆదితీ గజపతిరాజు సూచన