దొరికినపుడే దొంగ అన్నట్టుగ విజయనగరం ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన అమ్మాయిలు…!

3

ఓ వైపు ఒక్కో ఎస్ఐ కి రోజుకు ఇన్ని ఫైన్ లని… మరో వైపు  గంటలో ఇన్ని ఫైన్లతో ఇంత నగదు ప్రభుత్వానికి ఇవ్వాలన్న మౌఖిక ఆదేశాలు….ట్రాఫిక్ పోలీసులకు ఇవ్వడంతో గత్యంతరం లేక రద్దీ సమయాలలో రోడ్లై కాపు కాస్తున్నారు… విజయనగరం ట్రాఫిక్ పోలీసులు. గంట వ్యవధిలో ట్రాఫిక్ ఎస్ఐ త్రినాధ్… 30 ఫైన్ లు వేసి రికార్డ్ సృష్ఠించారు. ఈ ఆకస్మాత్ తనిఖీలలో భాగంగా విజయనగరం మూడు లాంతర్లు అమ్మవారి టెంపుల్ సాక్షిగా ముగ్గురమ్మాయిలు…. త్రిబుల్ రైడింగ్… వారిని ట్రాఫిక్ హెచ్. సి అప్పారావు ఆపుతున్నా  ధిక్కరించి వెళుతున్న ఆ ముగ్గురుని ఎట్టకేలకు ట్రాఫిక్ ఎస్ఐ త్రినాధ్…. పట్టుకున్నారు. వాళ్ల వద్ద కేవలం పీయూసి మినహా మరే ఇతర సర్టిఫికెట్లు లేకపోవడంతో…. ఆర్టీఏ, యాక్ట్ ప్రకారం    జరీమాన వేయడం,, ఆపై కేసు కట్టి కోర్ట్ కు పంపించారు… ట్రాఫిక్ పోలీసులు.