విశాఖ ఏర్ పోర్ట్ లో కేంద్ర విమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన నాయుడుకు ఘన స్వాగతం లభించింది.ఈ మేరకు విజయనగరం నుంచీ స్తానిక ఎమ్మెల్యే ఆదితీ గజపతిరాజు స్వయంగా ఏర్ పోర్ట్ కు వెళ్లి కేంద్రమంత్రి కి స్వాగతం పలికారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేసుకొని, ఆ శాఖ బాధ్యతలను చేపట్టిన అనంతరం మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకు విచ్చేస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు విశాఖ విమానాశ్రయం వద్ద విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద రావులు స్వాగతం పాల్గొన్నారు.