జరిగిన ఎన్నికలలో ప్రజలు అదేవిధంగాఓటర్లు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్పీపీ ఉత్తరాంధ్ర డిప్యూటీ కన్వీనర్ ,పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు నగర శివారు ప్రదీప్ నగర్ లో సిరి సహస్ర ప్యాలేఎస్ లో్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.”ఎన్నికలు ఫలితాలు నిరాశ పరిచాయి, ప్రజల తీర్పును శిరసా వహిస్తాం” అని వైఎస్ఆర్పీపీ ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.. ఎన్నికల్లో గెలిచిన కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు మనోభావాలకు అనుగుణంగా గెలిచిన అభ్యర్థులు నడుచుకుంటారని ఆకాంక్ష వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులకు జిల్లా పరిషత్ తరుపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన లో లోపాలను తాము తెలుసుకుంటామని తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఐదు ఏళ్ళులో అనేక హామీలు నెరవేర్చడం జరిగిందన్నారు. రాబోయే ఐదు ఏళ్ళు కూడా గెలిచినా అభ్యర్థులు వారి హామీలు నెరవేరుస్తారు అని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరుపున కష్టపడిన ప్రతీ నాయకునికి, కార్యకర్తకి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. వచ్చే ఐదేళ్ళు ప్రజల సమస్యలు మీద ఎప్పటిలాగే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు అధైర్య పడవద్దు అని విజ్ఞప్తి చేశారు. మళ్ళీ కలిసికట్టుగా అందరం పార్టీ కోసం పనిచేద్దామన్నారు.