ఏపీ రాష్ట్ర రాజకీయాన్ని…ప్రస్తుతం టీడీపీ శాసించబోతున్నది.అప్రతిహతంగా 175 సీట్లలో…140 సీట్లను కైవసం చేసుకున్న టీడీపీ…ఇక నామినేటెట్ పోస్ట్ లపై కూడా దృష్టి పెట్టబోతొంది. ఇక తొలిసారిగా ఎచ్చెర్లకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడ…విజయనరగం ఎంపీ గా గెలుపొంది..నాటి కొండపల్లి పైడితల్లి నాయుడు గెలుపొందిన ఓట్లను మించి సాధించడం విశేషం. దీంతో…దైవ దర్శనం కోసం..విజయనగరం ఎంపీ బయలు దేరారు.ఈ క్రమంలో విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని విజయనగరం ఎంపీ గౌరవ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలను అమ్మవారికి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గ అమ్మవారి ఆస్థాన వేద పండితులు అప్పలనాయుడు కుఆశీర్వచనాలు అందజేశారు. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజలు యావన్మంది సుభిక్షంగా, యోగక్షేమాలతో,ఆరోగ్యాలతో ఉండాలని శ్రీ కనకదుర్గ అమ్మవారిని అప్పలనాయుడు వేడుకున్నారు…