హనుమాన్ జ‌యంతి సందర్భం గా భారీ హనుమాన్ శోభాయాత్ర హిందూ ధర్మ రక్ష సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్

7

హనుమాన్ జ‌యంతి సందర్భం గా జూన్ 1 వ తేదీన‌ విజ‌య‌న‌గ‌రంలో భారీ హనుమాన్ శోభాయాత్ర నిర్వ‌హిస్తున్న‌ట్టు…హిందూ ధర్మ రక్ష సమితి పేర్కొంది. విజ‌య‌న‌గ‌రం బాబామెట్ రింగ్ రోడ్ లో విజ‌య‌న‌గ‌రం ఫంక్ష‌న్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో స‌మితి స‌భ్యులు… నందివాడ వేణుగోపాల్ సహా అధ్యక్షులు అబోతుల శ్యాంసుందర్, పార్ధ‌శార‌ధిలు మాట్లాడారు. న‌గ‌రంలోని కొత్తపేట కొత్తకోవెల నుండి హనుమాన్ విగ్రహాలతో కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం కోట నుండి మూడు లాంతర్లు గంటస్తంభం కన్యకాపరమేశ్వరి కోవెల రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ బాలాజీ జంక్షన్ మీదుగా తిరిగి కోట జంక్షన్ కి చేరుకుంటుందన్నారు. అంగరంగ వైభవం గా జరిగే ఈ హనుమాన్ శోభా యాత్ర లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ సహిత సీతారాముల వారి కృపకి పాత్రులు కాగలరని కోరారు.