ఆయనో రాజకీయ కురువృద్దుడు…మచ్చలేని నాయకుడు,…రాజుల వంశంలో జన్మించిన ఆణిముత్యం…తనకున్న జ్ఙానంతోనే..గల్లీ నుంచీ ఢిల్లీ వరకు ఎదిగిన రారాజు…నేత.ఆయన పూసపాటి అశోక్ గజపతిరాజు.టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హాయంలోనే ఆ పార్టీలో అడుగుపెట్టిన రాజకీయ దురందరుడు.వయస్సు మీద పడటం…దాంతో పాటు వెన్నుపూసకు చికత్స జరగడంతో కాస్త వెనకడుగు వేసారు.తన కూతుర్ని రాజకీయ ఆరంగేట్రం చేయించిన ఆశోక్…మే 28 న విజయనగరం తన బంగ్లాలో జరిగిన ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా నర్మగర్భ వ్యాఖ్యలు..సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
నిర్ధాక్షిణ్యంగా పది లక్షల మంది విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్ ను ప్రస్తుత సిఎం నాశనం చేశాడని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ సీనియర్ నేత, విజయనగరం రాజు అశోక్ గజపతి అన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పై విధంగా మాట్లాడారు. ఇక స్థానిక వైఎస్ఆర్సీపీ నేత… ఇటీవలే జొన్నవలసలో మాట్లాడుతూ ఏ ఇంట్లో అయినా పేరంటం జరిగినా వెళ్లుతున్నానన్న ఆయన…. మరి 450 మంది పిల్లల భవిష్యత్ ను ఎందుకు కాలరాశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన పార్టీలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారంటూ పార్టీ నేతలకు చురకలు అంటించారు….. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతి రాజు.