ఇటీవలే ఉత్తరాంద్రలో అదీ విజయనగరం జిల్లాలో తుపాను ప్రభావంతో మూడు రోజుల పాటు ముసురేసిన జిల్లాకు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ కారణంగా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయి.ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్,ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, డా.బీ.ఆర్.అంబేద్కర్ చెప్పారు.రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ఏ ఒక్కరూ ప్రస్తుతం వరి కోతలు కోయవద్దని, ఇప్పటికే కోసిన వారు కుప్పలు పెట్టాలని కలెక్టర్ తెలిపారు. నూర్చిన ధాన్యం ఉంటే సమీప కొనుగోలు కేంద్రానికి ఇవ్వాలని తెలిపారు. టార్పలీన్. అవసరం ఉన్నవారు పౌర సరఫరాల శాఖ లేదా రెవిన్యూ శాఖల అధికారులను సంప్రదించాలని తెలిపారు.