విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీ సమేతంగా సందర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు అధికారక లాంచనాలతో, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజానంతరం అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని బహూకరించారు. ముందుగా జాయింట్ కలెక్టర్ కార్తీక్, మంత్రికి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, ఆర్డీవో ఎం.వి.సూర్యకళ, తహసీల్దార్ పి.వి.రత్నం, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి.అన్నపూర్ణ, ఆలయ ఈవో డివివి ప్రసాదరావు, పూజారి వెంకటరావు, వేద పండితులు, టిడిపి నాయకులు ఐవిపి రాజు, కొండపల్లి కొండలరావు, పిల్లా విజయకుమార్, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు.