విజయనగరంలో సోనియా నగర్, సారిపల్లి ప్రాంతాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే ఆదితీ గజపతిరాజు,తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ యశస్విలతో కలిసి జిల్లా కలెక్టర్ డా.బీ.ఆర్.అంబేద్కర్ కలిసి పరిశీలించారు.ఇటీవల జరిగిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక లో పలువురు లబ్దిదారులు తమ ఇండ్లకు సౌకర్యాలు,వసతులు లేవని ఫిర్యాదులు చేసారు.అలాగే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా రావడంతో అంతా కలిసి నగర శివారు నెల్లిమర్ల పంచాయి పరిధిలోసారిపల్లి వద్ద ఉన్న టిడ్కో ఇండ్లను పరిశీలించారు.ఇళ్ల లబ్ధిదారులు, మునిసిపల్ అధికారులతో కాలనీ వాసుల సమస్యలపై చర్చించారు.. కలెక్టర్, ఎమ్మెల్యేలు.నెలాఖరులోగా టిడ్కో కాలనీ లో తాగునీరు, విద్యుత్, ప్రహారీ వంటి వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్.ఫిబ్రవరి నెలలో లబ్ధిదారులు ఇళ్లలోకి ప్రవేశించే విదంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
Home Uncategorized టిడ్కో ఇండ్లకు నెలాఖరులోగా వసతులు కల్పించాలి.ఎమ్మెల్యే,చైర్మన్ లతో కలిసి పర్యటించిన కలెక్టర్