విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తీసుకున్నారు.డీపీఓలో ప్రజల నుండి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఈ పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 27 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం అవీ 9 ఫిర్యాదులు రావడంతో అక్కడిక్కడే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడారు బాధితుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని పోలీస్ బాస్ ఆదేశించారు.