గిరిజన ప్రాంతాలలో్ ఏ గర్బిణిని డోలీలలో తీసుకెళ్లకుండా…చూస్తానని…రాష్ట్ర గిరిజన స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన అనంతరం…తొలిసారి పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాకు వచ్చారు.ముందుగా బంగ్లాలో ఎమ్మెల్యే ఆదితిని మర్యాద పూర్వకంగా కలిసారు.అనంతరం…బంగ్లా ఆవరణలో చెట్టుకింద….ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సంద్యారాణి మాట్లాడారు.నా మీద ఎంతో నమ్మకము తో సాలూరు ప్రజలు మంచి మెజర్టీ తో గెలిపించారన్నారు.
చంద్రబాబు నాయుడు నాకు మంత్రిగా మరింత బాధ్యత అప్పగించి పెట్టారన్నారు. రెండు జిల్లాలుగా ఉమ్మడి విజయనగరం విభజించ బడ్డా….ఉమ్మడి విజయనగరం జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఇక గిరిజన విద్యార్థులు మరణాలు తగ్గించాలి అనే ఉద్దేశం తో పనిచేస్తానని చెప్పుకొచ్చారు
Home Uncategorized గిరిజన ప్రాంతాలలో గర్బిణీల డోలీ కష్టాలను తీరుస్తా…!రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.