తన నియోజక వర్గంలో ప్రతీ కార్యకర్తల జాబితా తయారు చేయాలని విజయనగరం ఎమ్మెల్యే ఆదితీ గజపతి రాజు అన్నారు. పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో విజయనగరం నియోజక వర్గ విస్త్రత స్థాయి సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదితీ గజపతి రాజు కార్యకర్తలు,నేతలనుద్దేశించి మాట్లాడారు.ఇక నుంచీ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ..మండలాలలోనూ ప్రతీ కార్యకర్తల లిస్ట్ ను సిద్దం చేయాలని ఆమె పేర్కొన్నారు.తద్వరా డేటా ను సిద్దం చేస్తున్నామన్నారు. మీమీ వార్డు,డివిజన్ లో..న్యూట్రల్ వారిని అలాగే జనసేన ,బీజేపీ లిస్ట్ ను సిద్దం చేయాలన్నారు. ఇందుకు కోసం… కమ్యూనికేషన్స్ కోసం..పెద్ద కార్యక్రమాలకోసం..డేటా సిద్దం చేస్తున్నామన్నారు.ఇందుకు కోసం వంశీ,శంకర్ లను నియమిస్తునట్టు ఎమ్మెల్యే ఆదితీ గజపతి రాజు అన్నారు.